29
పులివెందుల పట్టణంలోని చెన్నారెడ్డి కాలనీలో నివాసముంటున్న విశ్వనాథరెడ్డి అనే ఉపాధ్యాయుని ఇంట్లో మంగళవారం దొంగతనం జరిగింది. సోమవారం పనుల నిమిత్తమై ఆయన కడపకు వెళ్లారు. ఇంట్లో ఎవరూలేని సమయం చూసి పసిగట్టిన దొంగలు ఇంటి తలుపులకు ఉన్న తాళాలు పగులగొట్టి 10తులాల బంగారు, నగదు తీసుకెళ్లినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.