127
కడప – రేణిగుంట జాతీయ రహదారి పనులు త్వరగా మొదలు పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి అన్నారు. మంగళవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. చెన్నై, ముంబై కలిపే రహదారి.. కేంద్ర ప్రభుత్వం రూ. 2254 కోట్లతో రొడ్డును మంజూరు చేసింది. అటవీ భూమికి సంబంధించి అనుమతి రాని కారణంగా పనులు చేయలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని అటవీ అనుమతులు తెప్పించి త్వరగా పనులు మొదలు పెట్టాలని ఆయన కోరారు.