89
సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపాటను నిరసిస్తూ.. కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఐ.ఎన్.టి.యు.సి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ దర్నాలో ఐఎన్టియూసి నాయకుడు త్యాగరాజన్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబర రావు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బొగ్గు బ్లాక్లను వేలం వేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దానిని ఆపాలని డిమాండ్ చేశారు. అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను, రాజకీయ పార్టీలను కలుపుకొని కార్యాచరణ రూపొందిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.