ముద్ర,ఆంధ్రప్రదేశ్:- అసెంబ్లీ స్పీకర్‌కు వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణస్వీకారం చేయడం సభాసంప్రదాయానికి విరుద్ధం అని అన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు తెలుస్తోంది. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చట్టంలో ఉందని చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంటులో కానీ, ఉమ్మడి ఏపీలో కానీ ఈ నిబంధన పాటించలేదని చెప్పారు. స్పీకర్ నాపట్ల శతృత్వం ఇప్పటికే చెప్పారు.
చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని గుర్తు చేశారు. నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే ఇలాంటి పరిస్థితులు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజాసమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందని అన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలని.