- మంత్రి రోజాపై సీఐడీకి ఫిర్యాదు
ముద్ర, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో క్రీడల పేరుతో భారీ ఎత్తున ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆత్యా – పాత్యా సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్. ఆడుదాం ఆంధ్రా, సీఎం కప్ ల పేరుతో మాజీ మంత్రి ఆర్కే రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రూ.100 కోట్ల అవకతవకలకు పరిశీలించారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఐడీకి ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నెల 11న సీఐడీ అదనపు డీజీపీకి తాము ఈ ఆర్థిక అవకతవకలపై ఫిర్యాదు చేశామని ప్రసాద్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన శాప్ ఎండీలు, శాప్‌లు, జిల్లాల్లో పనిచేసిన డీఎస్ డీవోలపై విచారణ జరపాలని కోరామని ఆయన చెప్పారు. నాటి కార్యకలాపాలకు చెందిన అన్ని దస్త్రాలను సీజ్ చేయాలని అన్నారు. ఐదేళ్ల కాలంలో శాప్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన పనుల్లో అవకతవకలను కూడా పరిశీలించాలని కోరారు.