ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆయన విజయవాడ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. శినివారం అక్కడే ఉంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు ఆర్థికశాఖ, జలవనరులశాఖ, రోడ్లు, రవాణా శాఖ మంత్రితో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న కొన్ని పథకాలకు పెండింగ్‌లో నిధులపై చర్చించే అవకాశం ఉంది. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలకు సంబంధించిన నిధులను దుర్వినియోగం చేసిన తీరును ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం, నిర్మాణ కేంద్రం అందించాల్సిన నిధులపైనా చర్చించనున్నారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమలోని వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సహాయానికి సంబంధించి కూడా వినతిపత్రం అందించనున్నట్టు పార్టీలు చెబుతున్నాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తోపాటు ఎంపీలు పాల్గొన్నారు. శుక్రవారం గాని, శనివారం ఉదయం లేదా సాయంత్రం పార్టీకి చెందిన ఎంపీలతోనూ ఆయన ఢిల్లీలో భేటీ అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు అందజేసే బాధ్యతలను శాఖలు వారిగా ఆయన ఎంపీలకు అప్పగించారు. ఆయా ఎంపీలు ఈ బాధ్యత ఎంత వరకు నిర్వర్తించారన్న దానిపై చంద్రబాబు నాయుడు ఎంపీలతో చర్చించనున్నారు.
కీలక ప్రాజెక్టులకు రావాల్సిన నిధులకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన ఖర్చు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఇంకా రావాల్సిన నిధులకు సంబంధించిన డాక్యుమెంట్స్‌తో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ప్రధాని, హోంమంత్రి, మంత్రులతో సమావేశం అనంతరం శనివారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ రెండు రోజులపాటు మంగళగిరి పార్టీ ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబుకు సంబంధించిన కార్యక్రమాలను రద్దు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్తించాలని పార్టీలు తెలిపాయి.
నేడు వైద్య సేవలు బంద్.. అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు
పెళ్లికి రెడీ అయ్యే జంటలు ఈ మెడికల్స్ చేయించుకోవడం ఉత్తమం