ముద్రణ,పానుగల్ :-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్, కేతేపల్లి గ్రామ వాసి డాక్టర్ కేతూరి వెంకటేష్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కల్పించాలని కోరినట్లు ఆయన తెలిపారు.గడచిన 23 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని, విద్యార్ధి దశ నుండి ఎన్ ఎస్ వై 2001 నుంచి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వున్నట్లు ఆయన తెలిపారు.
భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “భారత్ జోడో” యాత్రలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 150 రోజులు 4080 కిలో మీటర్లు రాహుల్ గాంధీ గారి వెంట అడుగులు వేస్తూ నా వంతు పాత్ర పోషించడం జరిగింది . తెలంగాణ ఉద్యమం మెదలుకొని ఎన్నో పోరాటాలలో ప్రత్యక్షంగా పాల్గొని అలుపెరుగని పోరాటంగా నా బాధ్యత నిర్వహించడం జరిగింది. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు కార్పొరేషన్ అవకాశం కల్పించాలని కోరినట్లు ఆయన తెలిపారు.