ముద్ర,తెలంగాణ:- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఓ జర్నలిస్ట్ పంపిన ఫోటో సంచలనంగా మారింది. ఆ ప్రాజెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
“సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం, మగ్దుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉందంటూ తెలిపారు.ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సులో “ఉచిత ప్రయాణ పథకం” వల్ల మేం ఉచితంగా బస్సెక్కి స్కూలుకు వెళ్లగలుగుతున్నాం అని తమ చేతిలో ఆధార్ కార్డులు చూపిస్తూ వాళ్లంతా సంతోషం వ్యక్తం చేస్తుంటే… ఒక జర్నలిస్టు మిత్రుడు ఇలా ఫోటో తీసి పంపాడు.”
సిద్ధిపేట జిల్లా, నంగునూరు మండలం, మగ్దుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది…
ఊరికి కిలో మీటర్ల దూరాన ఉన్న పాఠశాలకు రూపాయి ప్రయాణ ఖర్చు లేకుండా వెళ్లగలుగుతున్నారు.
ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సులో “ఉచిత ప్రయాణ పథకం” వల్ల… pic.twitter.com/rZs03J38wG
– రేవంత్ రెడ్డి (@revanth_anumula) జూన్ 14, 2024