Home » విలువలు, విశ్వసనీయతతో ముందడుగు వేయాలి.. ఎంపీలతో వైఎస్‌ జగన్‌ – Sravya News

విలువలు, విశ్వసనీయతతో ముందడుగు వేయాలి.. ఎంపీలతో వైఎస్‌ జగన్‌ – Sravya News

by Sravya Team
0 comment
విలువలు, విశ్వసనీయతతో ముందడుగు వేయాలి.. ఎంపీలతో వైఎస్‌ జగన్‌



రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత వరుసగా సమీక్షలు శుక్రవారం మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్టీకి చెందిన రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలతో సమావేశమైన ఆయన.. కీలక సూచనలు చేశారు. వైసీపీ పాలనను, చంద్రబాబు పాలనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఖచ్ఛితంగా మనం తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని జగన్ వ్యక్తం చేశారు. ఈలోగా ధైర్యాన్ని కోల్పోకూడదని, విలువలు, విశ్వసనీయతతో ముందడుగు వేయాలని పార్టీ ఎంపీలకు దిశా, నిర్ధేశం చేశారు. గడిచిన ఐదేళ్లలో ఎప్పుడూ చేయలేని విధంగా మంచి పాలన చేశామని, మేనిఫెస్టోలో హామీలను 99 శాతం అమలు చేశామన్నారు. ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన కోవిడ్ వంటి సంక్షోభాలు ఆ సవాళ్లను అధిగమించి ప్రజలకు మంచి చేశామన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో ఎప్పుడూ చూడని సంస్కరణలు అందించామని, ప్రజల ఇంటి వద్దకే అందించామని. అవినీతికి చోటు లేకుండా, వివక్ష చూపకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశామని, ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందించామన్నారు. సంస్కరణలతో పేదరికం నిర్మూలన దిశగా అడుగులు వేశామన్న జగన్‌ ఐబీ సిలబస్‌ను కూడా తీసుకువచ్చామని, ప్రఖ్యాత వర్శిటీల కోర్సులను విద్యార్థులకు అందించామన్నారు. నాణ్యమైన విద్యను అందించడం ద్వారా పేదరికం నిర్మూలన దిశగా ఐదేళ్లలో అడుగులు వేసినట్టు ఆయన చెప్పారు. టైట్లింగ్‌ యాక్ట్‌ను అందించిన అసెంబ్లీ సాక్షిగా టీడీపీ మద్ధతు పలికింది. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో సభ అనుసరిస్తున్న మంచి విధానాలన్నీ ఇందులో ఉన్నాయని సాక్షిగా ప్రశంసలు

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in