ముద్ర,ఆంధ్రప్రదేశ్:- టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేశారు.. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతోన్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలని సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిని నియమించిన పయ్యావుల.దీనికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంగీకారం తెలిపినట్లు చెప్పారు. స్వీకారం చేయనున్నారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.. అయితే, తెలుగు పార్టీలో సీనియర్ లీడర్ అయిన బుచ్చయ్య చౌదరి.. ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత ఏడుసార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి బుచ్చయ్య చౌదరి..
ఇక, ఈ నెల 21, 22 తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ దిశగా ఏర్పాట్లు చేస్తోంది.. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అధినేత వైఎస్‌జగన్మోహన్‌రెడ్డి సహా సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయనున్నారు బుచ్చయ్య చౌదరి. ఆ తర్వాత స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.. స్పీకర్‌గా మరో సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు పేరు వినిపిస్తున్న విషయం విధితమే. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ స్థానం నుంచి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించిన విషయం విధితమే…