Home » రాష్ట్రంలో 100 రోజుల్లో గంజాయిని అరికట్టాలి : మంత్రి నారా లోకేష్ – Sravya News

రాష్ట్రంలో 100 రోజుల్లో గంజాయిని అరికట్టాలి : మంత్రి నారా లోకేష్ – Sravya News

by Sravya News
0 comment
రాష్ట్రంలో 100 రోజుల్లో గంజాయిని అరికట్టాలి : మంత్రి నారా లోకేష్


గంజాయి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. 100 రోజుల్లో రాష్ట్రంలో గంజాయి లేకుండా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని. మంగళగిరిలో ఈద్గాలో బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. గంజాయిపై తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు హోం మంత్రిని, పార్టీ అధ్యక్షుడిని, పోలీసు సిబ్బంది కలిసి పరిశీలించారు. తనను గెలిపించిన మంగళగిరి ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి అనుగుణంగా ప్రణాళికను రూపొందించుకుంటున్నట్లు. రాష్ట్రంలో నేతలే టిడిపి నేతలపై దాడులకు పాల్పడ్డారు. మంగళగిరి నియోజకవర్గంలో చిలువూరులో మైనారిటీ సోదరుడిని క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపింది నిజం కాదా..? అని లోకేష్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాంతియుతంగా, ఓర్పుగా ఉండమన్నారనే విషయం గుర్తుంచుకొని దాడులకు దిగడం సహాయం. వైసీపీ నాయకులే దాడులకు పాల్పడుతూ తమపై ఎలా ఆరోపణలు చేస్తారంటూ లోకేష్ ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలనే శాంతియుతంగా ఉన్నామని స్పష్టం చేశారు. గెలిచి పది రోజులు మాత్రమే అయిందని, పదేళ్లలో ఎమ్మెల్యే ఏం చేశారో చెప్పగలరా..? అని ప్రశ్నించారు. విశాఖలో రుషికొండ వ్యవహారంపై ముఖ్యమంత్రి అధికారులకు నివేదిక సమర్పించాలని కోరారు. రుషికొండ లాంటి ఘటనలు రాష్ట్రంలో చాలా జరిగాయి, వాటన్నింటిపైన నివేదిక వచ్చిన తర్వాత ప్రజల ముందు బహిర్గతం చేస్తామన్నారు. హామీలను అమలు చేసే దిశగా ఎన్నికల్లో కార్యాచరణ రూపొందించామన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఐదు హామీల అమలుకు సంబంధించి సంతకాలు చేశారన్నారు. భవిష్యత్తులోనూ ప్రజలకు సంక్షేమాన్ని అందించడంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించేలా ముందుకు సాగుతామన్నారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని అగ్ర పథంలో పెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in