ప్రభుత్వాసుల్లో పని చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు బిల్లా పెట్టుకుని వెళ్లాలని, అధికారులు టీ ఇచ్చు మరి పని చేసి పెడతారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన ఆయనకు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల పాటు కార్యకర్తలు అవమానాలు పడ్డారని, వారందరికీ తాను మాటిస్తున్నానన్నారు. ‘రేపాటి నుంచి అధికారులకు సమావేశం పెట్టి చెబుతాను. ప్రతి కార్యకర్త ఎస్సై దగ్గరకు వెళ్లినా, ఎమ్మార్వో దగ్గరికి వెళ్లినా, ఎండీఓ దగ్గరకునా, ఏ ఆఫీసుకు వెళ్లిన పసుపు బిల్లు పెట్టుకుని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి మరి మీ పని ఏమిటి అని అడిగి మరీ చేస్తారు. మీ అందరికీ పని చేయించేలా అధికారులను లైన్ లో పెడతాను. ఎవరైనా ఒకరిద్దరూ నా మాటను జవదాటితే ఏమవుతారో వారికి నేను చెప్పాల్సిన అవసరం లేదు’ అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, 2019-24 మధ్య పరిపాలన ఎలా జరిగిందో చూశామన్నారు. రాష్ట్రంలో తన పార్టీ తప్పక ఉండకూడదు అన్నట్లు జగన్ వ్యవహరించారని, ఎప్పుడూ ఇన్ని బాధలు పడకూడదని. పార్టీ ఉంటుందా..? లేదా..? అని నిద్ర లేని రాత్రులు గడపనన్న మంత్రి.. కష్టపడి పని చేసినట్టు చెప్పారు. కార్యకర్తలు అండగా నిలబడ్డారని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 95 శాతం సీట్లు సాధించిన చరిత్ర ఏ పార్టీకి లేదని, కూటమి ఆ స్థాయిలో విజయాన్ని సాధించి గెలిచింది. ఎలా పరిపాలన చేయాలో ఆలోచన చేస్తున్నాము, ఎవరూ టెన్షన్ పడొద్దు అని తెలియజేసారు. తమది డబుల్ ఇంజన్ సర్కార్ అని, మోడీ సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాం. జీవితాంతం శ్రీకాకుళం వాసులకు సేవ చేసి రుణం తీర్చుకుంటామన్నారు.