ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ ను ఆ పార్టీ బరిలోకి దించాలని నిర్ణయించుకున్నారు. గతంలో వైసీపీ నుంచి ఈ స్థానానికి ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. ఆయన విశాఖ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానానికి ప్రస్తుతం ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 814 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా ఉమ్మడి విశాఖ జిల్లా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు. వీరిలో 620 మందికి పైగా వైసీపీకి చెందిన సభ్యులు ఉన్నారు. తమ కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకునే ఉద్దేశంతో వైసిపి వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. వైసిపి అభ్యర్థిగా మాజీ మంత్రి ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణను ఆ పార్టీ బరిలోకి దించింది. టిడిపి కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ బలమైన అభ్యర్థిని బరిలోకి దించుతుంది. ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జి, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ, వైసిపి నుంచి ఎన్నికల ముందు టిడిపిలో చేరిన సీతం రాజు సుధాకర్‌తోపాటు మరో అభ్యర్థిగా ఎంపికయ్యారు. . 200 మందికి పైగా మరో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను టిడిపి సాధించాల్సిన అవసరం ఉంది. కొంత ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆర్థికంగా బలమైన నేపథ్యం కలిగిన గోవింద సత్యనారాయణ అయితేనే గెలుస్తామన్న భావనతో టిడిపి ఆలోచన చేసింది.
ఎన్నికల బాధ్యతలను మంత్రులు కింజరాపు అచ్చం నాయుడు, గొట్టిపాటి రవికుమార్, హోం మంత్రి అనితతోపాటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత అప్పగించినట్లు చెబుతున్నారు. ఈ స్థానానికి కైవసం చేసుకొని రావాల్సిందిగా పార్టీ నేతలకు చంద్రబాబునాయుడు దిశా నిర్దేశం చెబుతున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ కూడా ఈ అవార్డును గెలుచుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తన అనుభవాన్ని అంత ఎన్నికల కోసం వినియోగిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత స్థానిక ఎన్నికల్లో సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులపై ఉందని బొత్స చెబుతున్నారు. ఆర్థికంగా బలమైన నేత కావడంతోపాటు ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత కావడంతో ఈయన అభ్యర్థిత్వాన్ని అన్ని నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు అంగీకరించారు. ఈ పార్టీలో అంతర్గత సమస్యలకు అవకాశం లేకుండా జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పదార్థాల కైవసం చేసుకోవడం ద్వారా అధికార పార్టీకి ఝలక్ అందించారు జగన్మోహన్ రెడ్డి తో పాటు వైసీపీ ముఖ్య నాయకులు.
గులాబీ రంగు హంసతో రష్మిక మందన్నా ఫొటో షూట్
బంగారం కొనడానికి వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోతారు..!