Home » ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం.. ఎప్పటి నుంచి అమలు అంటే..! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం.. ఎప్పటి నుంచి అమలు అంటే..! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya News
0 comment
 ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం.. ఎప్పటి నుంచి అమలు అంటే..!  - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఏపీలో కొత్త ప్రభుత్వం హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యత స్వీకరణ సమయంలోనే పెన్షన్ల పెంపు..అన్నా క్యాంటీన్లు..మెగా డీఎస్సీ పైన సంతకాలు చేసారు.ఇక, టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. దీని పైన తాజాగా బాధ్యత స్వీకరించిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేసారు. ఈ పథకం అమలు దిశగా తమ నిర్ణయాన్ని స్పష్టం చేసారు.

ఏపీలో మహిళలకు నెల మరో నెల మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు చెప్పారు.గత ప్రభుత్వ హయాంలో ఒక్క కొత్త బస్సు కూడా కొనడానికి. ఉన్న బస్సులోనే యథావిధిగా కొనసాగించారు. ఆర్టీసీ కాపాడేందుకు కృషి చేస్తానని. ఆర్టీసీ ఉద్యోగులతో పాటుగా ప్రయాణికులను కాపాడుకునే బాధ్యత తమపై ఉందని ఆయన పేర్కొన్నారు

ప్రభుత్వం కసరత్తు

తమ సర్కార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి కూటమిని నెరవేరుతుందని చెప్పారు. మరో నెల రోజుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ అవకాశం కల్పిస్తున్నాం. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కసరత్తు ప్రారంభించినట్లు చెప్పారు. అన్ని మార్గదర్శకాలు త్వరలోనే విడుదల అవుతాయన్నారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో అమలు చేస్తున్న ఈ పథకం పైన ఆర్టీసీ అధికారులు నివేదిక సిద్దం చేసారు. అక్కడ ఏ సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందో తెలుసుకొని ఇక్కడ విధి విధానాలు ఖరారు చేస్తున్నారు.

త్వరలోనే నిర్ణయం

తెలంగాణలో ప్రధానంగా అమలు అవుతున్న ఆధార్ నియమావళిని, జీరో టికెట్ పద్దతిని అక్కడ కూడా పాటిస్తారా లేదా ఇతర విధివిధానాలు అమలు చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ఈ పథకం అమలుకు ముందే కొత్త బస్సులను తీసుకోవాల్సి ఉందని ఆర్టీసీ యూనియన్లు చెబుతున్నాయి. ఈ విధంగా, మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం అమలు దిశగా కాల పరిమితి..తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in