రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత వివిధ పథకాలు అమలుకు సంబంధించి ప్రజలకు స్పష్టత రాలేదు. అదే సమయంలో సామాజిక మాధ్యమాల్లో అనేక అంశాలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. పింఛన్లు పంపిణీకి సంబంధించిన అనేక అంశాలు సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీసీ, చేనేత, జౌళిశాఖల మంత్రి ఎస్ సవిత పింఛన్లు పంపిణీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై ఒకటో తేదీన ఇంటి వద్ద సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయబడ్డాడు. అవ్వా, తాతలకు, దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బంది కలుగకూడదన్న ఉద్దేశంతో ఇంటి వద్దే పింఛన్లు పంపిణీకి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా పెనుగొండ నియోజకవర్గానికి ఆమె ఆదివారం వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెన్షన్లు పంపిణీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. పెన్షన్ లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంటి వద్దకే అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఎన్‌డీ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగ అగ్రస్థానంలో నిలుపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమంతోపాటు అభివృద్ధిపై నిరంతరం కృషి చేసినట్లు ఆమె. చేనేతకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్న ఆమె.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేనేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తానని వివరించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు పారదర్శకంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ సర్వతోముఖాభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్టు ఆమె వివరించారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంతోపాటు అభివృద్ధిలో పరుగులు పెట్టాలని ఆమె స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేకమైన ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు.