ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఐదేళ్ల పాలనలో జగన్ ఆంధ్రప్రదేశ్ లోని విలువైన భూములను కొట్టేశాడని, వేల కోట్ల విలువైన భూములను కాజేశాడని టీడీపీ నేత దేవినేని ఉమ. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని దోచేశాడని. ఖరీదైన ప్రాంతాల్లో వైసీపీ కార్యాలయాలకు, అస్మదీయులకు భూములు కేటాయించారని. చివరకు ప్రజాప్రయోజన కార్యక్రమాల కోసం కేటాయించిన భూములనూ వదల్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ స్థలాల్లో భారీ రాజభవనాల నిర్మాణం క్విడ్ ప్రో కో ప్రసిద్ది చెందింది. ఈ కేటాయింపులు కానీ, నిర్మాణాలకు సంబంధించిన వివరాలు కానీ రికార్డుల్లో ఎక్కడా కనిపించవని చెప్పారు. లెక్కల్లో చూపకుండా అందినకాడికి దండుకున్నారని. ఐదేళ్లలో జగన్ చేసిన ఈ భూ పందేరంపై సమగ్ర విచారణ జరిపి, చర్యలు తీసుకుని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వానికి దేవినేని ఉమ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో వేలకోట్ల విలువైన భూములను జగన్ రెడ్డి కొట్టేశాడు. ఇష్టారీతిన వైసీపీ కార్యాలయాలకు, అస్మదీయులకు అప్పగింత. ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు కేటాయించిన భూములు మళ్ళింపు. అక్రమ రాజభవనాల నిర్మాణం వెనుక భారీగా క్విడ్ ప్రోకో. రికార్డుల్లో ఒప్పందాలు ఉండవు.. లెక్కల్లో చూపించారు. ఐదేళ్లలో… pic.twitter.com/royKr6xwIs
— దేవినేని ఉమ (@DevineniUma) జూన్ 24, 2024