- కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
- మంత్రుల సమక్షంలోనే ఇరు పార్టీలకు చెందిన ఎంఎల్‌ఎల వాగ్వివాదం, తోపులాటలు
- కొట్టుకునేంత వరకు వెళ్ళిన పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ లు
- వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు
- బలవంతంగా కౌశిక్ రెడ్డి బయటకు పంపిన పోలీసులు
- రసాభాసగా మారిన కలెక్టరేట్ లో జరిగిన సమావేశం
ముద్ర, తెలంగాణ బ్యూరో :- సంక్రాంతి పండుగ సాక్షిగా రాష్ట్రంలో మళ్లీ రాజకీయ సెగలు రాజుకున్నాయి. కొంత కాలంగా రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న చందంగా వార్ సాగుతోంది. దీంతో ఎప్పుడు…ఎలాంటి పరిణమాలు చోటుచేసుకుంటాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వపరంగా ఎలాంటిది తలపెట్టినా? లేక పార్టీల వారిగా కార్యక్రమాలకు పిలుపునిచ్చానా? అవి తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆదివారం మంత్రుల సమక్షంలో…జిల్లా కలెక్టర్ రేట్ అధికార, విపక్ష పార్టీలకు చెందిన శాసనసభ్యులు పరస్పరం పాల్గొన్నారు. తీవ్ర స్థాయిలో వాగ్వివాదానికి పాల్పడ్డారు. ఒక దశలో కొట్టుకున్నంత పని చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో పరిస్థితి దాదాపుగా అదుపుతప్పుతున్నట్లే కనిపించింది.
అయితే సకాలంలో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి చక్కబడింది. వాదాలకు దిగిన ఎమ్మెల్యేలను సర్ది చెప్పడంతో పాటు ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యుడిని సమావేశం నుంచి బయటకు పంపడంతో గొడవ సద్దుమణిగింది. దీంతో కరీంనగర్ కలెక్టరేట్‌లో మంత్రులు నిర్వహించిన సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ఈ ప్రభుత్వ పథకాల గురించి చర్చ సాగుతుండగా.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (కాంగ్రెస్) జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ (బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన) మధ్య మాటామాట పెరిగి పరస్పరం తోసుకున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చ జరుగుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి.. సంజయ్‌తో వాగ్వాదానికి దిగారు. `అసలు.. నువ్వు ఏ పార్టీలో ఉన్నావ“ని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బిచ్చంతో గెలిచి.. ఈరోజు వేసిన మరో పార్టీలో చేరాలని ఏకి పారేశారు. సిగ్గు,లజ్జ, మానం ఉంటే.. మొగుడివైతే.. రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలని సంజయ్ కు సవాల్ విసిరారు. తన నియోజక వర్గం మీద రేవంత్ సర్కారు కావాలని.. చిన్న చూపుచూస్తోందనిస నిధులు మంజురు చేయడం లేదని ఫైర్ అయ్యారు. తాను దళిత బంధు పథకం, బీసీ బంధు, ఇతర నిధుల కోసం ప్రశ్నిస్తున్నందుకు తన మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో రైతులకు 50 శాతమే రుణమాఫీ అందుబాటులో ఉంది. కేసీఆర్ హయాంలో 18,500 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారని.. రెండో విడత దళిత బంధు అందించాలని డిమాండ్ చేశారు.
‘ప్రతి క్షణ రైతుల పక్షాన నిలబడతామన్నారు.అన్నదాతలకు ఇస్తామన్న రూ.15 వేలు రైతు భరోసా ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.ఈ వ్యాఖ్యలతో మరింత హీట్ ను పెంచింది. అధికార ప్రజాప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. ఫలితంగా అధికార ప్రతిపక్ష పార్టీల నేతల పరస్పర ఆరోపణలు…ప్రత్యారోపణలు, విమర్శలు…ప్రతివిమర్శలతో సమావేశం దద్దరిల్లింది. దీంతో పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి కౌశిక్ రెడ్డిని బలవంతంగా సమావేశం నుంచి బయటకు పంపారు. అనంతరం ఉద్రిక్త పరిస్థితులు కాస్త…. చక్కబడ్డాయి.
అనంతరం మీడియాతో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ బీఫామ్‌తో గెలిచి సంజయ్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మే గెలిచి కాంగ్రెస్ తరపున మాట్లాడితే చూస్తూ కూర్చోవాలా.? అని నిలదీశారు. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్టేనా.? అని ప్రశ్నించారు. ఇలా సభలో నిలదీసినందుకే తననుపోలీసులు బయటకు లాక్కొచ్చారన్నారు. అయినప్పటికీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.