Home » ఏపీ క్యాబినెట్‌లో మార్పులు.. నలుగురు మంత్రులకు ఉద్వాసన.? – Sravya News

ఏపీ క్యాబినెట్‌లో మార్పులు.. నలుగురు మంత్రులకు ఉద్వాసన.? – Sravya News

by Sravya News
0 comment
ఏపీ క్యాబినెట్‌లో మార్పులు.. నలుగురు మంత్రులకు ఉద్వాసన.?


ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటింది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వ పెద్దలకు పాలనపై పట్టు చిక్కుతోంది. కీలక నిర్ణయాలు తీసుకునే దశగా ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. అయితే, సీఎం చంద్రబాబు నాయుడు ఈ కోరుకునే నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. మంత్రివర్గంలో మార్పులకు ఆయన ఆలోచన ఉంది. గడచిన ఆరు నెలలు మంత్రివర్గంలోకి కొందరి నేతల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని సీఎం చంద్రబాబు నాయుడు వారికి ఉద్వాసన పలకాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ జాబితాలో నలుగురు మంత్రులు చూపిస్తున్నారు. అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడానికి ఏర్పాట్లను ఆయన అందిస్తుంది. కొత్త యాడాదిలోనే ఈ నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాబు క్యాబినెట్ నుంచి బర్తరఫ్ కాబోతున్న మంత్రులు ఎవరు అన్నదానిపై జోరుగా చర్చ సాగుతోంది. మంత్రులుగా ఎవరు పనితీరు ఎలా ఉంది అన్నదానిపై సీఎం చంద్రబాబు నాయుడు అందించారు. వారి పనితీరును బట్టి వారికి మార్పులు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సరిగా పనిచేయని మంత్రులపై వేటు వేసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సదరూ మంత్రులకు ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ వారి పనితీరులో మార్పు రా వారిని తొలగించడమే మంచిదన్న అభిప్రాయానికి సీఎం చంద్రబాబు నాయుడు వచ్చినట్లు చెబుతున్నారు. పనితీరు సరిగా లేని మంత్రులను తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశాలు కల్పించే ఆలోచనలో సీఎం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరుకునే వారి జాబితాలో ముఖ్య నాయకులు ఉండటం గమనరం. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో 24 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో జనసేనకు చెందిన ముగ్గురు మంత్రులు ఉండగా, బిజెపి నుంచి ఒకరు మంత్రిగా ఉన్నారు. మిగిలిన 20 మంది టీడీపీకి చెందిన మంత్రులే ఉన్నారు. మరో స్థానం ఖాళీగా ఉంది. దీనిని జనసేనకు కేటాయించినట్లు చెబుతున్నారు. సంక్రాంతి తర్వాత జనసేనకు సంబంధించిన మంత్రి స్థానంలో నాగబాబు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మేరకు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా నాగబాబు చేసుకుంటున్నారు. ఈ విధంగానే టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావుకు కూడా అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. ఒక స్థానమే ఖాళీ ఉండగా పల్లా శ్రీనివాస్ కు ఎలా అవకాశం కల్పిస్తారని దానిపై చర్చ జరుగుతుంది. బర్తరఫ్ అవుతారని ఆశిస్తున్న మంత్రుల జాబితాలో రామచంద్రపురం ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్, పార్థసారథి చెబుతున్నారు. అలాగే ఉత్తరాంధ్రకు చెందిన మరో మంత్రి పైన వేటు పడుతుందని అంటున్నారు. ఆయన విజయనగరం జిల్లాకు చెందిన మంత్రిగా చెబుతున్నారు. మంత్రిగా ఆయనకు బాధ్యత అప్పగించిన విజయనగరం జిల్లాలో ప్రతిపక్షం హడావిడి ఎక్కువగా ఉండటం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు అసహనంతో ఉన్నట్లు చెబుతున్నారు. స్థానానికి సంబంధించి జనసేనకు చెందిన మరో మంత్రిని తప్పించే ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా నలుగురు మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం కలిపించే రాష్ట్రంలో సీఎం ఉండటం పట్ల సర్వత్ర ఆసక్తి ఉంది. కొత్తగా ఎవరికి బాధ్యతలు దక్కుతాయి అన్న చర్చ జోరుగా సాగుతోంది.

వైసీపీలోకి మాజీ మంత్రి.. ఇప్పటికే జగన్ తో చేసిన సంప్రదింపులు
బాలీవుడ్ స్టార్లలో అత్యంత సంపన్నులు ఎవరంటే..

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in