- అనధికారికి నిర్మాణాలు కూల్చివేత
- రాజేంద్రనగర్ లోనూ కూల్చివేతలు
- హిమయత్ సాగర్ పై దృష్టి
ముద్ర, తెంలంగాణ బ్యూరో : హైదరాబాద్ ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై కొద్ది రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న హైడ్రా శనివారం నాడు ఫిల్మ్ నగర్ రోడ్డు నెం.12లో బుల్డోజర్లతో విరుచుకుపడింది. అక్కడి ప్రముఖ విగ్రహాల సమీపంలోని నిర్మాణాన్ని నేలమట్టం చేసింది. రెండు జేసీబీల సహాయంతో హైడ్రా సిబ్బంది షెడ్డును కూల్చివేశారు. ఫిల్మ్ నగర్ హౌజింగ్ సొసైటీ రోడ్డును ఆక్రమించి ఫిల్మ్ నగర్ మహిళా మండలి పేరుతో నిర్మాణం చేపట్టి కార్యకలాపాలు నిర్వహిస్తోందని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ లేఅవుట్ ను హైడ్రా అధికారులు పరిశీలించారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు జరిగినట్లు నిర్దారించారు. అదే ఆనుకుని ఉన్న ఇల్లు, ప్రహరీ కూడా ఆక్రమించి నిర్మించినట్లు నిర్ధారించారు.
ఈ హైడ్రా డిప్యూటీ సిటీ ప్లానర్ మూడు రోజుల కిందట ఫిల్మ్ నగర్ హౌజింగ్ సొసైటీకి నోటీసులు జారీ చేయబడ్డాయి. అనధికారికంగా నిర్మించిన ఫిల్మ్ నగర్ మహిళా మండలి భవనాన్ని 24 గంటల్లో ఉంచాలని. ఫిల్మ్ నగర్ హౌజింగ్ సొసైటీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని అనధికారిక నిర్మాణాన్ని కూల్చివేశామని హైడ్రా అధికారులు తెలిపారు. ఆ ప్రదేశంలో ఉన్న విగ్రహాల జోలికి వెళ్లలేదని స్పష్టం చేశారు. అయితే హైడ్రా కూల్చివేతపై ఫిల్మ్ నగర్ హౌజింగ్ సొసైటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ సొసైటీకి చెందిన 290 గజాల్లో మహిళా మండలి భవనంతో పాటు విగ్రహాలు పెట్టడానికి అనుమతిస్తామని, తాము ఎలాంటి రోడ్డును ఆక్రమించలేదని సొసైటీ కార్యదర్శి ఖాజానారాయణ తెలిపారు. తమ స్థలంలోని నిర్మాణాన్ని హైడ్రా అన్యాయంగా కూల్చివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజేంద్ర నగర్ లోనూ హైడ్రా కూల్చివేతలు
రాజేంద్రనగర్ లో హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. శాస్త్రీపురంలో ఫుట్‌పాత్‌లపై కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. 100 మంది పోలీస్ బందోబస్తు తో కూల్చివేతల పర్వం ఉన్నారు. రోడ్డుకు ఇరువైపులా వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ఫుట్ పాత్, రోడ్లను వ్యాపారులు కబ్జా అని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఫుట్ పాత్ కబ్జాతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం వేళలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది.
హిమయత్ సాగర్ పై దృష్టి
హైడ్రా అధికారులు హిమాయత్ సాగర్ ప్రాంతంపై దృష్టి సారించారు. హిమాయత్ సాగర్ జలాశయం బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల ఆధారంగా సర్వే చేయాలని హైడ్రా నిర్ణయించింది. 2010 నుంచి 2024 వరకు హిమాయత్ సాగర్ పరిస్థితిని అధ్యయనం చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఉస్మాన్ సాగర్‌పై దృష్టి పెట్టేలా హైడ్రా అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తుండగా.. రెండో విడతగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 549 చెరువులకు హైడ్రా సర్వే చేపట్టనుంది. అందుకు అనుగుణంగా ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ గుర్తించేందుకు 411 చెరువులకు ప్రాథమికంగా నోటిఫికేషన్ జారీ చేశారు.