12
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మున్సిపాలిటీ పరిధిలో పిల్లిగుండ్ల కాలనీ ప్రాంతం లో దొంగ విద్యుత్ కనెక్షన్ లు తీసుకోవడం చర్చనీయాంశం అవుతోంది. ఈ కాలనీలో దాదాపు 150 నివాస గృహాలు ఉండగా.. విద్యుత్ మీటర్లు లేకుండా అక్రమంగా విద్యుత్ ను వినియోగిస్తున్నారు. ఈ వ్యవహారం అధికారుల దృష్టికి వచ్చిన పట్టించుకోవడం లేదు. వెంటనే జిల్లా అధికారులు చట్ట పరమైన చర్యలు తీసుకొవాలని ప్రజలు కోరుకుంటున్నారు.