- పాఠశాల ఎదుట బంధువుల ఆందోళన
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా ఘటనలో మహాత్మ జ్యోతి బాపూలే పాఠశాలలో విద్యార్ధి మృతి మంగళవారం చోటు చేసుకుంది. పాఠశాల విద్య తెలిపిన వివరాల ప్రకారం పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఫయాజ్ హుస్సేన్ ప్రతిరోజు బేస్ బాల్ ఆడుతూ అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఇప్పటికే పరిస్థితి విషమించడంతో విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతికి గల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
బంధువుల ఆందోళన
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందున్న జాతీయ రహదారిపై మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. జ్యోతిబాపూలే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఫయాజ్ మృతికి పాఠశాల సిబ్బంది కారణమని ఆరోపిస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు. పాఠశాల సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్, పాఠశాల సిబ్బంది వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేది లేదని బైఠాయించారు. దీంతో జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్కు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. అనంతరం ఆర్డిఓ రత్న కళ్యాణి, డిఐఓ రవీందర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు న్యాయం చేశారు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
మృతుని కుటుంబానికి న్యాయం చేయండి:శ్రీహరి రావు
విషయం తెలుసుకున్న డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు కలెక్టర్కు ఫోన్లో సంప్రదించారు. బాధితునికి న్యాయం జరిగేలా చూడాలని.