48
తిరుపతి ఇస్కాన్ టెంపుల్ శ్రీహరి ప్రభు వారిచే శ్రీ రాధా దామోదర కార్తీక దీపారాధన మహోత్సవ కార్యక్రమం సోమవారం సాయంత్రం పీలేరు మండలం బోడుముల్లవారిపల్లి గ్రామంలో శ్రీకృష్ణ బృందావనం ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో హరే కృష్ణ భక్తులు న్యాయవాది పురుషోత్తం రెడ్డి గృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీహరి ప్రభు శ్రావ్య టీవీ న్యూస్ తో మాట్లాడుతూ.. కార్తీక మాసం భగవంతునికి ప్రీతికరమైన మాసం.. దీపారాధన సకల పాపాల హరణకు భగవంతునికి దగ్గరయ్యేదానికి సమయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జీవి శ్రీనాథ్ రెడ్డి, డాక్టర్ వెంకటరామయ్య, హరే కృష్ణ మునెప్ప, పల్లి గాండ్లపల్లి భజన బృందం తదితరులు పాల్గొన్నారు.