55
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో భక్తులను నిలువు దోపిడి చేస్తున్నారు. ఆలయంలోకి వాహనాలతో ప్రవేశించాలంటే ప్రైవేటు ఎంట్రీ ఫీజు రూ. 150 వసూల్ చేయడంతో పాటు పూజా సామాగ్రి విషయంలో ఇదే విధంగా దోపిడీ చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి ఆలయంలోకి వెళ్తే హుండీలో డబ్బులు కాదు పక్కన పెట్టండి అంటారు. ఆ తర్వాత అర్చన చేయాలంటే 100 రూపాయలు ఇవ్వాలి ఇది దేవాలయార్చన టికెట్ కాదు అందులో పూజారి అర్చన టికెట్ అవడం చర్చనీయాంశమైంది. ఇకనైనా ఆలయ అధికారులు దీనిపై కొంచెం దృష్టి పెట్టాలని.. భక్తులను నిలువు దోపిడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు.