3
వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. కోటి విరాళం అందించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేష్ కుమార్, డీజీఎం ఎంవీఎస్ సుధాకర్ గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు. ఇటీవల వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారు.