గత కొంతకాలంగా నడుస్తున్న ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈరోజు (అక్టోబర్ 16న) నాంపల్లి కోర్టు విచారణ చేపట్టాల్సి ఉండగా.. విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను నవంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. విచారణ చేపట్టాల్సిన న్యాయమూర్తి సెలవులో ఉండటంతో.. కేసును కోర్టు వాయిదా వేసింది. అయితే.. రోజు జరిగే విచారణకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా.. ఆయన ఇతర పనుల రీత్యా హాజరుకాలేదు. మరోవైపు.. జడ్జి కూడా లేకపోవటంతో.. విచారణను నవంబర్ 14వ తేదీకి వాయిదా వేశారు. దీంతో.. మరో నెల రోజుల పాటు రేవంత్ రెడ్డికి భారీ ఊరట దక్కింది. 2015 జూన్ 1న జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికలకు ముందు టీడీపీ పార్టీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేసినందుకు ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు రేవంత్ రెడ్డి.. 50 లక్షల రూపాయల నగదు ఇచ్చినట్టుగా వీడియోలు బయటపడ్డాయి. ఆ సమయంలో రేవంత్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ వ్యవహారంపై 2018లో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అయితే.. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో రేవంత్ రెడ్డిని మొదటి నిందితుడిగా ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న స్టీఫెన్ సన్‌తో పాటు ఇతరుల స్టేట్ మెంట్లను ఈడీ రికార్డు చేసింది. కాగా.. అదే ఏడాది రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.
ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట.. కోర్టుకు కూడా రాకుండానే..!
6
previous post