18
గత పదేళ్లలో కేసీఆర్ సర్కారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. గాంధీ భవన్లో బుధవారం ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని అన్నారు. గత ప్రభుత్వం 150 మందికి మాత్రమే విదేశీ విద్యానిధి ఇచ్చిందని, తమ ప్రభుత్వం 500 మందికి ఇస్తోందని తెలిపారు. మూసీ నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే ఖాళీ చేయిస్తున్నామని తెలిపారు.