6
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బర్కత్ పుర భాగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రామంతరపుర్ లోని పాల్ టెక్నిక్ కళాశాల గ్రౌండ్ లో విజయదశమి ఉత్సవం నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బర్కత్ పుర భాగ్ విద్యార్థి విభాగం ర్యాలీగా భారీగా స్టేడియానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వక్తగా తెలంగాణ సహా ప్రాంత ప్రచారక్ శ్రీ ప్రభు కుమార్ జీ వ్యవహరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సాధారణ ప్రజలని ఒక్క తాటికి తీసుకొచ్చి.. ధర్మ సంరక్షణ కోసం రాక్షస సంవారం చేసినటువంటి.. త్రేతాయుగంలో రాముడు జీవటం కనిపిస్తోందన్నారు. భూమిలో శ్రీ రామడి జన్మ ” ధర్మ సంరక్షణ కోసం” లభించిందని తెలిపారు. అలాగే ఈ సమాజంలో శక్తి ఉపాసన సహజంగా జరుగుతుందని.. ఈ దేశంలో జ్ఞానానికి కొదవ లేదనీ, ధనానికి కూడా కొడవలేదని పేర్కొన్నారు.