60
ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందించే పథకంలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపికైన దమ్మపేట మండలం అల్లిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ డిజిటల్ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులకు పూర్తి అవగాహన కలిగించి, గ్రామస్తులు నుండి వివరాలు సేకరిస్తూ డిజిటల్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు, స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.