తెలంగాణ మీదుగా తరలిస్తున్న సుమారు రూ. 4కోట్ల విలువ చేసే నిషేధిత గంజాయిని ఎక్సైజ్ అధికారులు దహనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం పరిధిలోని పాల్వంచ, అశ్వరావుపేట, మణుగూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 22 కేసుల్లో పట్టుబడ్డ 1065.13 కేజీల గంజాయిని ఖమ్మంలోని ప్రభుత్వ అమోదిత డిస్ట్రాయిడ్ కన్సల్టింగ్ ఏడబ్ల్యూఎస్ కంపెనీలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంజాయిని దహనం చేశారు. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుంచి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, రాజస్థాన్‌తో పాటు పలు రాష్ట్రాలకు సరపరా అవుతున్న గంజాయిని తీసుకు వెళ్లాలంటే వయా ఖమ్మం, భద్రాచలం మీదుగా వెళ్లాల్సిందేనని అధికారులు వివరించారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల ఎక్సైజ్ అధికారులు, ఎస్టీఎఫ్, డీటీఎఫ్ టీమ్‌లు గంజాయిని కలిసి పట్టుకున్నారని తెలిపారు. పాల్వంచ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 కేసుల్లో 1036.43 కిలోల గంజాయి, అశ్వరావుపేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసులో 2.8 కిలోల గంజాయి, మణుగూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 కేసుల్లో 25.9 కిలోల గంజాయిని పట్టుకున్నామని వివరించారు.
ఖమ్మంలో రూ. 4 కోట్ల విలువ చేసే గంజాయి దహనం..
45
previous post