ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. పార్టీ అధికారంలోకి వస్తే కష్టపడి పని చేసిన నాయకులకు తగిన గుర్తింపు ఇస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు ఆ దిశగా వేగవంతంగా చర్యలు చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా కార్పొరేషన్లకు సంబంధించి పదవులు పొందిన నాయకులలో టిడిపి, జనసేన,బిజెపికి చెందిన నేతలు ఉన్నారు. కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైన వారి వివరాలు ఇలా ఉన్నాయి. వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) చైర్మన్ గా అనిమిని రవి నాయుడు, ఏపీ హౌసింగ్ బోర్డ్ కు బత్తుల తాతయ్య బాబు, ఏపీ షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ గా బొరగం శ్రీనివాసులు, మారిటైమ్ బోర్డ్ చైర్మన్ గా దామచర్ల సత్య, కల్పన & ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ సొసైటీ చైర్మన్‌గా దీపక్ రెడ్డి నియమితులయ్యారు.
అలాగే, 20 పాయింట్ల ఫార్ములా ఛైర్మన్ గా – లంకా దినకర్, మార్క్‌ఫెడ్ ఛైర్మన్ గా- ఏపీ కర్రోతు బంగార్రాజు, ఏపీ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ సంస్థ ఛైర్మన్ గా మన్నె సుబ్బారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) ఛైర్మన్ గా మంతెన రామరాజు, ఏపీ పద్మశాలి సంక్షేమ, అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నందం అబద్దయ్య, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నూకసాని బాలాజీ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, వైస్ చైర్మన్ గా పీఎస్ మునిరత్నం, ఏపీ అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పీలా గోవింద, లెదర్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పిల్లి మాణిక్యాల రావు, రాష్ట్ర యాజమాన్య రక్షణ మండలి కార్పొరేషన్ చైర్మన్ గా పీతల సుజాత, ఏపీ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తమ్మిరెడ్డి శివ(జనసేన), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా తోట మెహర్ సుధీర్ (జనసేన), ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ గా వజ్జా బాబురావు, ఏపీ టౌన్‌షిప్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వేములపాటి అజయ్‌కుమార్ (జనసేన) నియమితులయ్యారు. మొత్తంగా 20 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించిన ప్రభుత్వం ఇందులో టిడిపికి 16, జనసేనకు మూడు, బిజెపికి ఒకటి చొప్పున చైర్మన్లను కేటాయించారు. అలాగే కొన్ని కార్పోరేషన్లకు సంబంధించిన డైరెక్టర్లను కూడా ప్రభుత్వం నియమించింది.
బీపీని తగ్గించడానికి 5 నేచురల్ టిప్స్
భూమ్మీద అత్యంత అనారోగ్యకర ఆహార పదార్థాలు ఇవే..