తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం సమీపంలో బ్యాగ్ కలకలం సృష్టించింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వివరాలు.. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో అనుమానస్పద స్థితిలో ఓ బ్యాగ్ కనిపించడం కలకలం రేపింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు అనుమానాస్పద బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అనుమానాస్పద బ్యాగ్‌ను అక్కడి నుంచి అధికారులు తరలించి తనిఖీలు చేస్తున్నారు. బాంబు స్క్వాడ్ ఆ బ్యాగ్‌ను తనిఖీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఆ బ్యాగ్ ఏముందనేది తెలియాల్సి ఉంది.ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.