నేడు తెలంగాణలో పలు రాజకీయ నేతలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి హరీశ్ రావు సహా పలు మంది హౌస్ అరెస్ట్‌కు గురయ్యారు. బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని నిరసనగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం హైదరాబాద్ తరలి వెళ్తున్న సందర్భంలో అడ్డాకుల మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడ్డాకుల మండల కేంద్రంలోని పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ. తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు ఇలాంటి అరెస్టులు కొత్త కాదని అక్రమ ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. అరికపూడి గాంధీ అనుచరులను వెంట వేసుకొని తోటి ఒక శాసనసభ్యుడి ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు.
నేను కాంగ్రెస్ లో చేరలేదు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న అన్న అరికపూడి గాంధీ మాటలకు. కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ. శాంతియుతంగా రేపు ఉదయం అరికపూడి ఇంటికి వెళ్లి ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగురవేసి అతనికి పార్టీ కండువా కప్పి కేసీఆర్ దగ్గరికి తీసుకెళుతా అన్నారు. రాజకీయాలలో దానికి మీ అభిప్రాయం చెప్పాలి కానీ సమాధానం చెప్పకుండా కౌశిక్ రెడ్డి ఇంటిపై తన అనుచరులతో దాడి చేయించి వాడరాని భాష మాట్లాడుతూ. ఇంటి మీద దాడికి రావడం సిగ్గు చేటు అని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
హౌస్ అరెస్టులతో రాష్ట్రం ఉత్కంఠ
9