12
ఖమ్మం అర్బన్ మండలం ధంసలాపురంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పర్యటించారు. ముంపు బాధితుల ఇంటింటికి తిరిగి వారిని ఓదార్చి, ప్రభుత్వం అన్నివిధాల అండగా నిలుస్తుందని ధైర్యం చెప్పారు. దెబ్బతిన్న ఇండ్లు, రహదారులను పరిశీలించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, బాధితులను ఆదుకునేందుకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించిందని తెలిపారు. ఎంపీ ఈటెల రాజేందర్ ఉన్నారు.