100
ఖమ్మం పోలీసులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాము ఉదయం నుండి ఖమ్మంలో పర్యటిస్తున్నా పోలీసులు రాలేదన్నారు. కాంగ్రెస్ అల్లరి మూకలు, పోలీసులు కలిపి ఒకేసారి వచ్చారు. అప్పుడే తమపై దాడి జరిగిందన్నారు. తిరిగి కాంగ్రెస్ అల్లరి మూకల మీద దాడి జరగకుండా పోలీసులు కాపాడారని అయన ఆరోపించారు. మంగళవారం ఖమ్మంలో ముంపు ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించారు.