గడచిన కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీగా వచ్చి చేరిన నీటితో ప్రకాశం బ్యారేజీ, పోలవరం ప్రాజెక్టు వద్ద నీరు ఉప్పొంగుతోంది. కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతి తీవ్రంగా ఉంది. గంట గంటకు వరద పెరుగుతోంది. ఆదివారం సాయంత్రానికి బ్యారేజీ వద్ద 9.02 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయబడింది. అర్ధరాత్రి సమయానికి వరద ప్రవాహం 10 లక్షల క్యూసెక్కులు దాటింది. 2009 అక్టోబర్ 5వ తేదీన రాత్రి 11 గంటలకు అత్యధికంగా పాలకొల్లు లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. బ్యారేజి చరిత్రలో ఇదే రికార్డు. దానికి ముందు దిగువ 1998లో అత్యధికంగా 9.32 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పైకి శ్రీశైలం, నాగార్జునసాగర్ లోకి పెద్ద ఎత్తున ప్రవాహం వస్తోంది. నాగార్జునసాగర్ నుంచి ఆరు లక్షలకుపైగా క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీ మధ్యలో మరో మూడు లక్షల క్యూసెక్కులు కలుస్తున్నాయి. బ్యారేజీకి భారీ ప్రవాహం మరో 48 గంటలపాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీంతో నది తీర ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం అనూహ్యంగా పెరిగింది. అన్ని ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉపనదులైన మంజీర, కిన్నెరసాని, ప్రవర, ప్రాణహిత, శబరి, సీలేరు నదులు, కొండవాగులు పొంగి గోదావరిలో కలుస్తుండడంతో వరద పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్ వే నుంచి ఐదు లక్షల 5,75,264 క్యూసెక్కుల జలాలు దిగువకు ప్రవహిస్తున్నాయి. అధికారులు స్పిల్ వే 48 గేట్లు ఎత్తారు. స్పిల్ వే ఎగువన 30.420 మీటర్లు, దిగువన 21.400 మీటర్లు నీటిమట్టం నమోదైన ప్రాజెక్టు ఈలు పీ వెంకటరమణ, మల్లికార్జునరావు ఉన్నాయి.
నేడు రాష్ట్రానికి 40 పవర్ బోట్లు
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల సముచిత చర్యలకు సహకరించాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆదేశించారు. ఆదివారం రాత్రి కేంద్రమంత్రి అమిత్ షాతోపాటు కేంద్ర హోం సెక్రటరీతో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. వరద సహాయక చర్యల కోసం అత్యవసరంగా పవర్ బోట్లు రాష్ట్రానికి పంపాలన్నారు. దీంతో ఆరు ఎండీఆర్‌ఎఫ్ బృందాలను ఇతర రాష్ట్రాల నుంచి తక్షణమే ఏపీకి పంపుతున్నట్లు హోంశాఖ సెక్రటరీ సీఎంకు సమాచారం అందించారు. 40 పవర్ బోట్లు, ఆరు హెలిక్యాప్టర్లను రాష్ట్రానికి పంపుతున్నట్లు మొత్తం ఏర్పాటు చేశారు. వాయు మార్గంలో మరో నాలుగు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను రాష్ట్రానికి పంపుతున్నట్లు చెప్పారు.
మూడు నెలల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి.. సిద్ధమవుతున్న రైళ్లు
కీర్తి సురేష్ | నీలం రంగు చీరలో కీర్తి సురేశ్