110
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘ఓజీ’ సినిమాలో నటించడం తన అదృష్టమని హీరోయిన్ ప్రియాంక మోహన్ అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. ‘సరిపోదా శనివారం’ మూవీ ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. పవన్, నాని ఎప్పుడూ క్రియేటివ్‌గా ఆలోచిస్తారని చెప్పారు. పవన్ ప్రజల గురించి ఆలోచిస్తే, నాని సినిమాల గురించి కలలు కంటారని తెలిపారు. కాగా సరిపోదా శనివారం మూవీ ఈ నెల 29న థియేటర్లలో విడుదల కానుంది.