Home » జర్నలిస్టుల భద్రత కోసం రాష్ట్రంలో ప్రత్యేకచట్టం తీసుకురావాలి! ఐజేయూ కార్యదర్శి – డి.సోమసుందర్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

జర్నలిస్టుల భద్రత కోసం రాష్ట్రంలో ప్రత్యేకచట్టం తీసుకురావాలి! ఐజేయూ కార్యదర్శి – డి.సోమసుందర్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya News
0 comment
జర్నలిస్టుల భద్రత కోసం రాష్ట్రంలో ప్రత్యేకచట్టం తీసుకురావాలి! ఐజేయూ కార్యదర్శి - డి.సోమసుందర్ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


తాడేపల్లిగూడెం ,ఆగస్టు 17 :జర్నలిస్టుల భద్రత కోసం ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఐ.జే.యు. జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి చర్చిస్తారు.

ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ 67వ వార్షికోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

మండల పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జరిగిన సమావేశానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగసురేష్ అధ్యక్షత వహించారు. తమ్మిశెట్టి రంగ సురేష్ మాట్లాడుతూ 67 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఎపియు.డబ్ల్యూ.జే. జర్నలిస్టుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. రాష్ట్ర ,జాతీయ స్థాయి సమస్యల పరిష్కారం కోసం పై స్థాయిలో పోరాడుతూనే, స్థానిక సంక్షేమ జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ లు ఏర్పాటు చేసి కృషి చేసిందని అన్నారు.సభ్యుల సంక్షేమానికి ప్రెస్ క్లబ్ కట్టుబడి ఉందని , ఇళ్లస్థలాల కోసం చేస్తున్న కృషి త్వరలో ఫలిస్తుందని తెలిపారు.

ముఖ్యఅతిథిగా హాజరైన ఐజేయు జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై ఎ.పి.యు.డబ్ల్యూ.జే. రూపొందించిన పదిహేను అంశాల డిమాండ్ల పత్రాన్ని ఇప్పటికే సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి కి, సంచాలకులు హిమాన్షు శుక్లా కు అందజేద్దామని, నారా లోకేష్ సహా మంత్రులకు అందజేస్తామని తెలిపారు.

ఎ.పి.యు.డబ్ల్యూ.జే. రాష్ట్ర ప్రతినిధి బృందం త్వరలో ముఖ్యమంత్రిని కలిసి సమస్యలపై చర్చిస్తుందని అన్నారు. అక్రెడిటేషన్లు, హెల్త్ కార్డులు , ప్రమాద బీమా, సంక్షేమ నిధి , గృహస్థలాలు , జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం వంటి వివరాలను యూనియన్ దృష్టి సారిస్తున్నదని సోమసుందర్ అన్నారు.

ఎ.పి.యు.డబ్ల్యూ.జే. జిల్లా కార్యదర్శి గజపతి వరప్రసాద్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ గత 67 సంవత్సరాలుగా సాగిన పోరాటాల ఫలితంగా రాష్ట్రంలో జర్నలిస్టులకు పలు సౌకర్యాలు లభించాయని అన్నారు. సమస్యల కోసం జర్నలిస్టులు మరింత ఐక్యంగా పోరాడాలని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నో సమస్యల పరిష్కారం కోసం యూనియన్ విశేష కృషి చేసిందని గజపతి వరప్రసాద్ తెలిపారు.

యూనియన్ అవుతా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు యడ్లపల్లి మురళీ కృష్ణ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై ఆశాభావం వ్యక్తం చేశారు.

యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్. వి. లక్ష్మయ్య, సహాయ కార్యదర్శి కె. మోషే బాబు , గారపాటి ప్రసాద్ , వానపల్లి పుండరి కాక్షుడు , బాసంశెట్టి బాల బాలాజీ , నిర్వహించారు. ప్రెస్ క్లబ్ కార్యదర్శి గొలిమె బుజ్జిబాబు స్వాగతం పలికారు.

ఇటీవల కన్నుమూసిన ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీ రావు, రాష్ట్ర జర్నలిస్టు సంఘం పూర్వాధ్యక్షుడు, సీనియర్ సంపాదకుడు గారపాటి ఉపేంద్రబాబు, సీనియర్ పాత్రికేయుడు కూన పాపారావు మృతికి సంతాపం తెలుపుతూ సమావేశంలో రెండు నిముషాలు మౌనం పాటించారు.

అశ్వస్థతకు గురై ఇటీవల చికిత్స పొంది కోలుకున్న పాత్రికేయులు వూసా దుర్గారావు , కొప్పిశెట్టి దుర్గాప్రసాద్ , గొలిమే బుజ్జిబాబు, మేకా ఆదినారాయణ , గారపాటి ప్రసాద్ కు ప్రెస్ క్లబ్ తరపున ఆర్థిక సహకారాన్ని అందించి సత్కారం చేశారు.

న్యాయశాస్త్ర పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిసేట్టి రంగ సురేష్, జర్నలిజం డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత సాధించిన కొత్తపల్లి గోపీచంద్ , మేకా ఆదినారాయణను ఐజేయు జాతీయ కార్యదర్శి డి. సోమసుందర్ అభినందన సత్కారం చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in