Home » త్రివేణి స్కూల్ ను వెంటనే సీజ్ చేయాలి: PDSU భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగల శివ ప్రశాంత్ డిమాండ్

త్రివేణి స్కూల్ ను వెంటనే సీజ్ చేయాలి: PDSU భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగల శివ ప్రశాంత్ డిమాండ్

by v1meida1972@gmail.com
0 comment

భద్రాచలం పట్టణంలో త్రివేణి విద్యా సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని PDSU భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగల శివ ప్రశాంత్ ఆరోపించారు. ప్రవేట్ విద్యాసంస్థలో ప్రభుత్వ నిబంధనలను పాటించాలని చట్టాలు ఉన్నప్పటికీ ఏ మాత్రం పట్టించుకోకుండా త్రివేణి పాఠశాల నిర్వహిస్తున్నారన్నారు. భద్రాచలం ఏజెన్సీలో ఫీజుల వివరాలు నోటీస్ బోర్డులో పెట్టకుండా విద్యార్థుల తల్లిదండ్రి దగ్గర నుండి ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా పాఠశాలను నిర్వహిస్తున్నారని, యూనిఫామ్స్ బుక్స్, టై బెల్ట్, ఇతర వస్తువులు త్రివేణి స్కూల్లోనే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులకు చెబుతున్నారన్నారు. త్రివేణి విద్యాసంస్థకి ఆట స్థలం లేకుండా పాఠశాలను నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు చదువుతోపాటు ఆటపాటలు కూడా ఉండాలని ప్రభుత్వానిబంధనలు ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. విద్యాశాఖ అధికారులు ఇవన్నీ తెలిసినప్పటికీ పాఠశాలపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారన్నారు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలు, ఆట స్థలం లేక స్కూల్ ముందున్న ఫుట్ పాత్ మీద జెండా ఎగరవేశారు. ఇవన్నీ విద్యాశాఖ అధికారులకు కనబడడం లేదా అని ఆయన ప్రశ్నించారు. స్వతంత్ర వేడుకలు ఫుట్ పాత్ పై చేయడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. త్రివేణి విద్యా సంస్థపై ఇప్పటికైనా డీఈవో, ఎంఈఓ లు స్పందించి స్కూల్ పై చర్యలు తీసుకోవాలని స్కూల్ ని సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల PDSU ఆధ్వర్యంలో దశల వారి పోరాటం నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులను హెచ్చరించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in