కృష్ణా జిల్లా గుడివాడలో ‘అన్న క్యాంటీన్’ను ఏపీ సీఎం చంద్రబాబు మార్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ఉన్నారు. చంద్రబాబు దంపతులు పలువురికి భోజనం వడ్డించారు. అనంతరం పేదలతో కలిసి భోజనం చేశారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
2014 – 2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన అన్న క్యాంటీన్లను, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూసివేసి రోడ్డున పడింది. అధికారంలోకి వచ్చాక తిరిగి అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎన్డీయే ప్రభుత్వం, తాజాగా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెడుతోంది. 203 అన్న క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని భావించినా భవన నిర్మాణ పనులు పూర్తి కానందున తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. రెండు, మూడు విడతల్లో మిగిలిన క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.