కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే యనమల దివ్య హర్ ఘర్ తిరంగా పిలుపు మేరకు విద్యార్ధి లోకం మేము సైతం అంటూ కధనోత్సహం చూపించింది. విద్యార్ధుల వేషధారణలు, స్కౌట్ విద్యార్ధుల ప్రదర్శనలు హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాజా గ్రౌండ్ నుంచి ప్రారంభమైన హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యనమల దివ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు హాజరయ్యారు. రాజా గ్రౌండ్ కు తరలివచ్చిన వేలాదిమంది విద్యార్థులకు అభివాదం చేస్తూ సభా వేదికకు వచ్చిన ఎమ్మెల్యే యనమల దివ్య ఉపాధ్యాయ బృందం ఘన స్వాగతం పలికారు. అనంతరం జాతీయ జెండాను చేతబట్టిన ఎమ్మెల్యే దివ్య విద్యార్థులను ఉత్సాహపరిచారు. అనంతరం హర్ ఘర్ తిరంగా ర్యాలీకి ఆమె పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. రాజా గ్రౌండ్ నుంచి విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే దివ్య మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు పురవీధుల గుండా ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ గొల్ల అప్పారావు సెంటర్ కు చేరుకున్న తర్వాత అక్కడ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. హర్ ఘర్ తిరంగా ర్యాలీలో జాతీయ జెండాను చేత పట్టిన విద్యార్థులు మువ్వెన్న జెండాను రెపరెపలాడించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణితో పాటు సీనియర్ నేతలు యనమల రాజేష్, సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, చింతంనీడి అబ్బాయి, పరవాడ తాతబాబు, మల్ల గణేష్, దంతులూరి చిరంజీవి రాజు, కుక్కడపు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
తుని విను వీధుల్లో ప్రతిధ్వనించిన దేశ భక్తి
20