Home » ఆర్5 జోన్ లబ్ధిదారుల అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం – Sravya News

ఆర్5 జోన్ లబ్ధిదారుల అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం – Sravya News

by Sravya News
0 comment
ఆర్5 జోన్ లబ్ధిదారుల అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం


అమరావతి, ఈవార్తలు : ఆర్5 జోన్ లబ్ధిదారుల అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధానిలో ఆర్5 జోన్‌లో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు వారి సొంత ఇళ్ల స్థలాలు నిర్ణయించారు. అవసరమైతే టిడ్కో ఇళ్లు నిర్మించి ఇద్దామని. తాజా నిర్ణయంతో ఆర్5 జోన్ వివాదానికి పరిష్కారం లభించినట్లు అయ్యింది. గత ప్రభుత్వం విజయవాడ, గుంటూరు వాసులకు ఆర్5 జోన్‌లో ఇళ్ల స్థలాలను కేటాయించింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు కోర్టును ఆశ్రయించారు. తాజాగా, చంద్రబాబు ఆర్5 జోన్ సమస్యకు పరిష్కార మార్గం వెతికినట్లు అయ్యింది.

అసలేమిటీ ఆర్5 జోన్..

అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గత ప్రభుత్వం 2022 అక్టోబర్‌లో సీఆర్డీయే చట్టం-2014కు మార్పులు చేసింది. ఆర్5 పేరుతో హౌసింగ్ జోన్ ఏర్పాటు చేసింది. సీఆర్డీయే చట్టంలోని సెక్షన్-53(డీ) ప్రకారం ల్యాండ్ ఫూలింగ్ కింద సమీకరించిన విస్తీర్ణంలో 5 శాతం గృహ నిర్మాణాలకు కేటాయించవచ్చు అన్నదానిపై ఆధారపడి గత ప్రభుత్వం ఈ మార్పులు చేసింది. సెక్షన్ 41లో మార్పులు చేసి కొత్త జోన్‌ను తెచ్చింది. దాన్నే ఆర్ 5 జోన్‌గా పిలిచింది. 900.97 ఎకరాల భూమిని ఇళ్ల నిర్మాణం కోసం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆ చట్టాలకు అనుగుణంగా 2023 మార్చి 31వ తేదీన జీవో 45 విడుదల చేసింది. రాజధాని రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు నోటీసులు
బంగారం కొనడానికి వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోతారు..!

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in