గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ పోలీసులు షాకిచ్చారు..! విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్నిరోజుల కిందటే ఈ నోటీసులు ఇచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ నోటీసులకు ముందే ఆయన విదేశాలకు వెళ్లినట్లుగా కూడా ఉన్నారు. అయితే ఈ విషయాలను పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.
ఈ కేసులో ఇప్పటి వరకు 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ ప్రోద్బలంతోనే తాము ఈ దాడికి పాల్పడినట్లు అరెస్టైన వారిలో కొందరు పోలీసులకు చెప్పారు. దీంతో వంశీని కూడా నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం అతను ఈ కేసులో ఏ71గా ఉన్నాడు.ఈ కేసులో మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ21 మొండెం రాంబాబు, ఏ50 అమరేంద్రరెడ్డి, ఏ62 ఇమ్రాన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల నుంచి ప్రకటన రావాల్సి ఉంది.