45
చట్టాలపై మహిళలకు అవగాహన కలిగి ఉండాలనీ బుదేరా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉమెన్ డిగ్రీ కళాశాలల్లో చట్టాలపై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ జడ్జి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు సంబంధించిన వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఫోన్ వాడకం పెరిగిందనీ.. దీంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరిగాయని.. సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, భరోసా, సఖి ఉమెన్స్ వింగ్ లు పని చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి ఎస్సై రాజేష్, కళాశాల ప్రిన్సిపాల్ అరిఫా తాహీసిన్, సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.