30
బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వేంపల్లె సీఐ చాంద్ బాషా హెచ్చరించారు. వేంపల్లెలోని పులివెందుల, కడప రోడ్డు ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్ కు తరలించి, వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.