Home » మంత్రి పొంగులేటి చొరవతో కూసుమంచిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ

మంత్రి పొంగులేటి చొరవతో కూసుమంచిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ

by v1meida1972@gmail.com
0 comment

బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరగకముందే పాలేరు నియోజకవర్గాన్ని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపనల చేయడం, మున్నేరుకు కరకట్ట నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది. అలాగే చెక్ డ్యాంల ఏర్పాటు.. ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి చొరవతో ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కూసుమంచి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డ్ కు ఆదేశాలు ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2024-25 ఏడాది నుంచే కళాశాల అందుబాటులోకి రావాలని జీవోలో పేర్కొన్నారు. ఈ నెల 22 సోమవారం నుంచి విద్యార్థినీ, విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కూసుమంచిలో కళాశాల ఏర్పాటు పట్ల పాలేరు నియోజకవర్గానికి చెందిన విద్యార్థినీ, విద్యార్థులు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in