వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో జరిగిన అరాచకాలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర వివిధ జిల్లాలకు చెందిన పలువురు పార్టీలో చేరిన సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వైసీపీ పాలనలో దారుణాలపై ఆ పార్టీ ఎప్పుడు స్పందించింది. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులపై ప్రధానికి జగన్ లేఖ రాయడం విడ్డూరంగా ప్రదర్శన. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో అనేక దుర్మార్గాలు జరిగాయి, వీటిపైన ఏనాడు ఆయన స్పందించిన దాఖలాలు లేవన్నారు. రోగ నిర్ధారణ సమయంలో మాస్క్ కోసం డాక్టర్ సుధాకర్ ప్రశ్నిస్తే ఆయన తీవ్రంగా వేధించారని, ఆఖరికి చనిపోయేలా ఈ సందర్భంగా పురందేశ్వరి గుర్తు చేశారు. తన అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు పదహారేళ్ల చిన్నారిని కాల్చిపడేసిన విషయంపై జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరులో నామినేషన్ వేయడానికి వెళ్లిన తమ పార్టీ అభ్యర్థుల చేతుల్లో ఉన్న పత్రాలను వైసిపి కార్యకర్తలు చింపేశారు. తమ పార్టీకి చెందిన మహిళ కార్యకర్తను గాయపరిచారు. అప్పట్లో ఆయన ఈ తరహా దాడులపై స్పందించి ఉంటే బాగుండేదన్నారు.
ప్రధానికి రాయడంపై వైయస్ జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా పురందేశ్వరి స్పష్టం చేశారు. రాష్ట్రానికి సాయం అందించిందని చెప్పేందుకు విశాఖలోని మెడ్ టెక్ జోన్ ఉదాహరణగా ఆమె ఈ సందర్భంగా. ఈ విషయంలో జగన్ సహకారం ఏమీ లేదని ఆ సంస్థే స్వయంగా వెల్లడించింది. రాష్ట్రానికి అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని గతంలోనూ అందించిందనీ, ప్రస్తుతం కూడా అందిస్తోందన్నారు. ఈ విషయాలేవీ తెలియకుండా పేర్ని నాని ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పసలేని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న దాడులు హేయమైనవని, సామాజిక మాధ్యమాల్లో అనైతిక వీడియోలు కారణంగా చిన్నారులు పక్కదోవ పడుతున్నారు. సోషల్ మీడియాలో కంటెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందిస్తోంది అన్న పురందేశ్వరి.. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంతోపాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు.