25
ప్రొద్దుటూరు స్థానిక నేతాజీ నగర్ 3వ లైన్ లో నివాసముంటున్న గడ్డమీది బాలనాగమ్మ హత్యోదంతం పట్టణంలో సోమవారం సంచలనం సృష్టించింది. గంటల వ్యవధిలోనే చేధించి నిందితుడిని అరెస్టు చేశారు. మంగళవారం డిఎస్పీ మురళీధర్ విలేకరులతో మాట్లాడుతూ మృతురాలు భర్త గడ్డమీద రామయ్య ఫిర్యాదు మేరకు నిందితుడు జయచంద్రుడిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. కుటుంబ కలహాలు, మనస్పర్థలు నేపథ్యంలోనే హత్యకు గురైనట్లు డిఎస్పీ తెలిపారు.