63
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అన్నారు. పులివెందులలోని మెడికల్ కళాశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపి విభాగం, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆయన సిబ్బందితో చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కలను సాకారం చేస్తామని ఎమ్మెల్సీ తెలిపారు.