ముద్ర,ఆంధ్రప్రదేశ్:-టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరో గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షాతోపాటు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవికూడా హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ హాజరుకావాలని కోరుతూ చంద్రబాబు చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానాన్ని పంపారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరంకు చిరంజీవి వెళ్లనున్నారు. విజయవాడలో రాత్రి బసచేసి ఉదయం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొననున్నారు. పవన్ కూడా రేపు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన తర్వాత చిరంజీవితో పాటు రాంచరణ్ కూడా ప్రమాణ స్వీకారోత్సవం హాజరు అవుతున్నట్లు ప్రకటించారు.
ఇవాళ రాత్రికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడలో చేరుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఉదయం 11గంటలకు విజయవాడ చేరుకుంటారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్ విడుదలైంది.