గుండాల జూన్ 10 (ముద్ర న్యూస్):- యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోని అనంతరం గ్రామంలో ఫంక్షన్ హాల్ నిర్మాణం కొరకై చామల సోమిరెడ్డి పర్మిషన్లతో దరఖాస్తు చేసుకున్నారు. ఇట్టి ఫంక్షన్ హాల్ ప్రభుత్వ పాఠశాలకు 400 మీటర్ల అతి దగ్గరగా ఉండటంతో ఫంక్షన్ హాల్ కు ఇరువైపులా ప్రజల ఇండ్లు ఉండటంతో ప్రజలంతా ఒక్కటై పేసరు రేఖా రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు,ప్రజలు మాట్లాడుతూ చామల సోమిరెడ్డి అన్ని పర్మిషన్లు నాకు ఉన్నాయని హాల్ పెట్టి ఎట్టి పరిస్థితిలోనైనా ప్రజలకు ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు. నిర్మించబడిన చుట్టుపక్కల ఇండ్ల వాళ్లకి డీజే సౌండ్ లతో ఫంక్షన్లు జరిపిన నేపద్యంలో మద్యం తాగి పక్కల ఉన్న ఇండ్ల ఇబ్బందులకు గురయ్యారు,కాబట్టి ఫంక్షన్ హాల్ ఊరికి చివరగా నిర్మించాలని నిర్ణయించారు.
ఇరు వర్గాలను అభిప్రాయాన్ని చేర్చుకోవడానికి డి ఎల్ పి ఓ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పిటిషన్ దారులు అయిన పెసర రేఖ రెడ్డి శ్యామలకి సోమిరెడ్డి గ్రామపంచాయతీ దగ్గర వారి వాదనలు విని ప్రజల అవసరాల దృష్ట్యా నిర్ణయం తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బందిగా ఉందని ప్రభుత్వ అధికారి చెప్పినట్లు మరొకచోట నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.